74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం పంజా జంక్షన్ లోని శ్రీ వివేకానంద విద్య నికేతన్ ప్రిన్సిపాల్ కె. యస్. యన్ మూర్తి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ జెండా వందనం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ద్రోణంరాజు శ్రీవత్సవ్ పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ వత్సవ మాట్లాడుతూ టీచర్లు కీలకమైన సబ్జెక్టులు మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటుగా సోషల్ స్టడీస్ ను కూడా ప్రతి ఒక్క విద్యార్థి అంర్ధం చేసుకునేలా అందులో ముఖ్యంగా మన రాజ్యాంగ విశిష్టతను తెలుసుకునేల కృషిచేయాలని కోరారు.