భారత రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను హరిస్తూ దేశ చరిత్రను వక్రీకరించి పరిపాలన సాగిస్తున్న బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ మతతత్వ విధానాలకు నిరసనగా పోరాటం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీపీఐ విశాఖ జిల్లా కార్యాలయంలో జాతీయ పతాకాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణమూర్తి గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని, సంఘ్ పరివార్ శక్తులు భారత రాజ్యాంగంలోని విలువైన మౌలిక సూత్రాలను కాలదన్నే రీతిలో వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు సీపీఐ శ్రేణులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యులు క్షేత్రపాల్, నాయకులు కాసులరెడ్డి, శ్రీను ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు