విశాఖపట్నం ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజాబాబు తెలిపారు. గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జీవీఎంసీ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నగర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ముందున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసామన్నారు. విశాఖపట్నంను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలియజేశారు. జీవీఎంసీ పాలకవర్గం, కార్పొరేటర్లు, అధికారులు ఇతర ప్రజాప్రతిని సహకారంతో మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనుందని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దోమలు, పందుల నియంత్రణకు గట్టి చర్యలు చేపట్టామని పారిశుధ్య పరిస్థితులు తెలిపారు ఈ సందర్భంగా జీవీఎంసీ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరియు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్లు అందచేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి మేయర్ గొలగాని హరి వెంకట కుమారితో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.