రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే గణతంత్ర ఫలాలు ప్రతీ ఒక్కరికి అందుతున్నాయని శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి చెప్పారు. 74వ రిపబ్లిక్ డే వేడుకలు సందర్భంగా గురువారం కృష్ణా కళాశాల సమీపంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలోఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రమేష్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరుదు కళ్యాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలు నిజమైన గణతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని చెప్పారు. రమేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి స్వాతంత్ర సమరయోధుల కన్న కలలు నిజం చేసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దివంగత అంబేద్కర్, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అక్కరమాన్ని విజయనిర్మల, డాక్టర్ రహమాన్, పక్కి దివాకర్, నడింపల్లి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.