ఏధ్రా యూనివర్సిటీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. బాస్కెట్బాల్ మైదానంలో జరిగిన వేడుకల్లో వైస్ ఛాన్స్ లర్ పి. వి జి. డి ప్రసాదరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాక మాట్లాడారు మహాత్మాగాంధీ, బి. ఆర్. అంబేద్కర్ వంటి మహనీయుల త్యాగ ఫలాలు ఫలితమే గణతంత్రమని అన్నారు. యూనివర్సిటీలో కొత్త కోర్సులు ప్రారంభించడం, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధితోపాటు ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కట్టమంచి రామలింగారెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు.