కర్ణాటకలోని మాండ్య జిల్లాలో దారుణం జరిగింది. నందన్, చెన్నరాజు(45) అనే ఇద్దరు వ్యక్తుల మధ్య భూవివాదం ఉంది. దీన్ని పరిష్కరించుకునేందుకు మద్దూరు తాలూకా ఆఫీసుకు ఇద్దరూ మంగళవారం వచ్చారు. అక్కడ నిర్ణయం చెన్నరాజ్కు అనుకూలంగా రావడంతో నందన్ కోపం పెంచుకున్నాడు. చెన్నరాజ్ కళ్లలో కారం కొట్టి, పదునైన కత్తితో నరికాడు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.