ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లా బ్రహింపూర్ గ్రామంలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. కొందరు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. ఒకరిని ఒకరు రాళ్లతో చితక్కొట్టుకున్నారు. చిబ్రామౌ సౌరిఖ్ రోడ్డులో తొలుత దుకాణదారుడితో ఓ వ్యక్తికి గొడవ జరిగింది. క్రమంగా ఆ గొడవ పెద్దదైంది. రెండు గ్రూపులకు చెందిన వారు రోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. పోలీసులు ఈ గొడవపై విచారణ చేపట్టారు.