టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ పెళ్లి పీటలెక్కాడు. తన ప్రేయసి మేహా పటేల్ ను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. అక్షర్, మేహా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది వీరికి నిశ్చితార్థం జరిగింది. గురువారం గుజరాత్ లోని వడోదరలో వీరి వివాహం జరిగింది. సంగీత్ వేడుకలో అక్షర్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.