కుక్కల దాడిలో 80 మంది గాయపడ్డారు. గాయాలతో జిల్లా ఆస్పత్రికి క్యూ కట్టారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. కుక్కకాటు కేసులతో దాదాపు 80 మంది అర్రా జిల్లా ఆసుపత్రికి వచ్చారు. రోగులలో 10 నుంచి 12 మంది పిల్లలున్నారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. రోగులకు ప్రథమ చికిత్స అందిస్తున్నామని డాక్టర్ నవనీత్ కుమార్ చౌదరి తెలిపారు. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.