ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ఫైనల్ లో సానియా మీర్జా-రోహన్ బోపన్న జోడి ఓడిపోయిన విషయం తెలిసిందే. తన చివరి గ్రాండ్ స్లామ్ లో ఓడిన తర్వాత సానియా మీర్జా భావోద్వేగానికి గురైంది. మ్యాచ్ అనంతరం ఆమె తన టెన్నిస్ జర్నీ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. గ్లాండ్ స్లామ్ కెరీర్ లో సానియా మీర్జాకు ఇదే చివరి మ్యాచ్. ఆమె కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.