డిప్లమో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒంగోలు నగరం బత్తులవారికుంటలో గురువారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళితే.. పుల్లా సూర్య (19) తన స్నేహితులతో కలిసి స్థానిక మినీ స్టేడి యంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అక్కడ కొంత మంది స్నేహితులతో గొడవ జరిగింది. అనంతరం సూర్యను మార్గమధ్యలో కొంతమంది అటకాయించి దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన సూర్య ఇంటిలో రేకుల షెడ్ రాడ్‌కు వైరు తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు సంఘటనా స్థలాన్ని వెళ్ళి పరిశీలించారు.