నెల్లూరు జిల్లా, అనంతసాగరం, మండలంలోని లింగంగుంటలో కొండచిలువల బెడద ఎక్కువైంది. దీంతో ప్రజలు హడలెత్తి పోతున్నారు. బుధవారం సాయంత్రం రెండు కొండ చిలువలు కోళ్లను మింగగా, స్ధానికులు గుర్తించి వాటిని హతమార్చారు. వారం క్రితం తుమ్మలమ్మ ఆలయం వద్ద పెద్ద కొండ చిలువను గుర్తించిన స్థానికులు దాన్ని చంపేశారు.