ఝార్ఖండ్ ధన్బాద్లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదం జరిగింది. కాస్ హజారా, ప్రేమ హజారా అనే దంపతులిద్దరూ వృత్తిరీత్యా వైద్యులు. వీరు సొంతంగా నిర్మించుకున్న ఆస్పత్రిలోనే ఇల్లు కూడా ఉంది. ఇంటికి, ఆస్పత్రికి ఉన్న కారిడార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ ఏర్పడటంతో ఊపిరాడక వైద్య దంపతులు సహా వీరి పనిమనిషి, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో రోగులెవరూ చనిపోలేదని పోలీసులు తెలిపారు.