రాష్ట్రంలో పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి హ్యాండ్లింగ్ ఛార్జీలను పెంచింది. PDSలో భాగంగా MLS పాయింట్ల వద్ద సరుకు లోడింగ్, అన్ లోడింగ్ చేసే హమాలీలకు ప్రస్తుతం క్వింటారు రూ.22 ఇస్తున్నారు. వాటిని రూ.25 కు పెంచింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 28.48 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌరసరఫరాల సంస్థ ఎండీ తెలిపారు.