ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి కి గుండెపోటు, ఆగిపోయిన నిశ్చితార్థం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 01:11 PM

 కొడుకు నిశ్చితార్థం రోజునే గుండెపోటుతో తండ్రి మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బోయ ధర్మన్న (52), లక్ష్మి దంపతుల కొడుకు మల్లేష్‌ను నిశ్చితార్థం కోసం బంధువులు, గ్రామస్థులు, గ్రామపెద్దలు నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామానికి చెందిన యువతితో గురువారం రాత్రి నిశ్చితార్థం జరుగుతుండగా సూగూరులో ఉన్న తండ్రి బోయ ధర్మన్న గుండెపోటు మృతి చెందాడు. వధూవరులు దండలు మార్చుకుంటుండగా విషయం ఫోన్‌ ద్వారా తెలిసింది. దీంతో మల్లేష్‌ నిశ్చితార్థం నిలిపివేసి తండ్రిని చూసేందుకు బయలుదేరి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు, మల్లేష్‌ బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com