జగనన్న చేదోడు గడువు పెంచాలని శనివారం సిపిఎం మండల నాయకులు చిన్న ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న చేదోడు పథకం ఇంకా చాలామంది లబ్ధిదారులు నమోదు చేసుకోవాల్సి ఉందని, దాని గడువును పెంచాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు.