శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలిమత్తూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని చిలమత్తూరు సర్పంచ్ సంధ్య శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణ హృదయం, షుగర్ క్లినిక్ హిందూపురం వారి సౌజన్యంతో ఈ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోందని ఇందులో డాక్టర్ నరసింహారెడ్డి గుండె జబ్బు, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితరవాటికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa