ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువనేత రామచంద్రయ్యకు అఖిల భారతీయ యాదవ సంఘం కడప జిల్లా ఉపాధ్యక్షులు, కెఎస్ఆర్ హరిత ఫౌండేషన్ చైర్మన్ కదిరి సంజీవ రాయుడు యాదవ్, జిల్లా సెక్రటరీ పంగా సుబ్బరాయుడు యాదవ్ అధ్వర్యంలో శనివారం దువ్వూరు పట్టణంలో స్వాగతం పలికారు. రామచంద్రయ్య సంగమేశ్వరం దగ్గర కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఐకాన్ బ్రిడ్జి బదులుగా బ్రిడ్జ్ కం బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ తో యాత్ర చేపట్టారు. పుంగనూరు రామచంద్రయ్య యాదవ్, కడప బాలకృష్ణ యాదవ్ లు పుంగనూరు నుండి బయలుదేరి రాయచోటి, కడప, మైదుకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల దారి మీదుగా సంగమేశ్వరం చేరుకునే క్రమంలో దువ్వూరు గ్రామంలోని ఏకోపల్లె సమీపంలో ఉన్నటువంటి గంగమ్మ దేవాలయం పనులను సందర్శించారు. దువ్వూరు మండలం యాదవ్ సోదరులు కలిసి అక్కడ ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంగా సుబ్బరాయుడు, మారుగని సురేష్ యాదవ్, టిడిపి దువ్వూరు మండలం యూత్ లీడర్ గంగాధర్, ముని, రవి శంకర్ యాదవ్ కే సుబ్బరాయుడు, మైదుకూరు అఖిలభారతి యాదవ సంఘం ఉపాధ్యక్షులు పంగా గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.