తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. ఈ నెల 30,31న సమ్మె చేస్తామని బ్యాంకు ఉద్యోగుల సంఘం యూఎఫ్బీయూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యూఎఫ్బీయూ నేడు ప్రకటించింది. ఉద్యోగుల డిమాండ్లపై జనవరి 31న చర్చించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించడంతో సమ్మె వాయిదా పడింది.