ప్రైవేట్ ఫొటోలను లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్న 17 ఏళ్ల బాలుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో పలువురు అమ్మాయిలతో నిందితుడు స్నేహం చేసే వాడని పోలీసులు తెలిపారు. తర్వాత వారి ప్రైవేట్ ఫొటోలను సేకరించి బెదిరించే వాడని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికను ఇలాగే ఫొటోలు, వీడియోలతో బెదిరించగా, బాలిక తండ్రి సైబర్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.