మహారాష్ట్రలోని థానె జిల్లా డోంబివిలి పట్టణంలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలిక శుక్రవారం తన ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లింది. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము పోలీసులమని నమ్మించారు. బాలికను కారులో ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బెదిరించారు. బాలిక ఫిర్యాదుతో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.