అఫ్ఘనిస్తాన్ ను పాలిస్తున్న తాలిబన్లు ఆ దేశ మహిళలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పటికే యూనివర్సిటీలు, పని ప్రదేశాల్లో మహిళలను నిషేధించిన తాలిబన్లు, తాజాగా మహిళలపై మరో నిషేధం విధించారు. తాజాగా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థినులపై నిషేధం విధిస్తూ ప్రకటించారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ అన్ని యూనివర్సిటీలకు నోటీసులు పంపింది. కాగా, ఈ నిర్ణయంపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.