ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 'జగనన్న చేదోడు' పథకం మూడవ విడత సాయాన్ని ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఒక్కొక్కరికి రూ.10వేల ఆర్థిక సాయం చేయనుంది. రేపు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభ ద్వారా సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.