రాజకీయ నిరుద్యోగులు పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్‌లేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. జగనన్న ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులంతా ఉద్యోగాలు సాధించి సంతోషంగా ఉన్నారని, ఏ పనీ పాటు లేకుండా. అధికారం కోసం లేని పోని విమర్శలు చేస్తున్న పవన్, చంద్రబాబు, లోకేష్‌లే రాజకీయ నిరుద్యోగులన్నారు. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరై రోజా శనివారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేత నారా లోకేశ్ పై మండిపడ్డ మంత్రి రోజా. లోకేష్ పెద్ద ఐరెన్ లెగ్ అని విమర్శించారు. అతను ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగుదేశం పార్టీకి ప్రజలకు కీడు జరుగుతూనే ఉందన్నారు. లోకేష్ పెద్ద పులకేష్ అని విమర్శించారు.