ద్వారక బస్సు స్టేషన్ విశాఖపట్నం నుండి నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి రోజు ఉదయం 5. 00 గంటల నుండి రాత్రి 11: 00 వరకు ప్రతి గంటకు ఒక అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇంద్ర ఏ. సి సర్వీసు నడుపబడుతున్నాయని ఆదివారం పలాస ఆర్టిసి మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని, ప్రయాణికులు పై రిజర్వేషన్ భారం పడకుండా ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ఛార్జి రూ. 20/- కేవలం రూ. 5/- గా తగ్గించడమైనదనీ తెలిపారు. రిజర్వేషన్ కౌంటర్ కూడా పలాస, ఇచ్చాపురం ప్లాట్ ఫారం దగ్గర లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రయాణికులు పై సౌకర్యమును వినియోగించుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఆన్ లైన్ రిజర్వేషన్ చేసుకో దలచినవారు www. apsrtconline. in వెబ్సైట్లో, రిజర్వేషన్ కౌంటర్ నందు కూడా బుక్ చేసుకొనవచ్చును. మద్దిలపాలెం, ఇసుకతోట, హనుమంతవాక, కారుషెడ్/మధురవాడ మారికవలస పికప్ పాయింట్ సదుపాయం కలదు.
రాను పోను టికెట్ ఒకే సారి బుక్ చేసుకున్నవారికి తిరుగు ప్రయాణపు ఛార్జిలో 10శాతం తగ్గింపు సదుపాయం ఉందని తెలిపారు.