నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలో గత కొన్ని రోజుల నుంచి వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. తాజాగా నాలుగేళ్ల బాలికను విచక్షణారహితంగా కుక్కలు కరవడంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది. బాలిక కాళ్లు, తొడలపైన కండలు ఊడిపోయేలా కలవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే స్థానికులు భయపడుతున్నారు.