బీయస్పీ ఆధ్వర్యంలో ఈనెల 30న నర్సీపట్నం సిబీఎం కాంపౌండ్ లో జరిగే బహుజన చైతన్య సభను జయప్రదం చేయాలని పార్టీ జిల్లా ఇంచార్జ్ బొట్టా నాగరాజు పిలుపునిచ్చారు. ఈమేరకు ఆటో ప్రచారాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న బహుజన రాజ్యాధికార యాత్ర నర్సీపట్నం ఈనెల 30న వస్తున్న నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, బహుజనులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సీనియర్ బహుజన నాయకులు పెద కుమార్ బాబు మాస్టారు ఈ ప్రసార ఆటోకి జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగాధర్, అప్పలనాయుడు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.