గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ చందన్ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్ అసత్యలను పలికించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం నర్సీపట్నంలో విమర్శించారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర అంశాలపై గవర్నర్ ప్రసంగంలో తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మీద అవాస్తవాలు గవర్నర్ చేత చెప్పించారని విమర్శించారు. ప్రభుత్వం వాస్తవాలు బయట పెట్టలేదన్నారు.