గాండ్లపెంట మండలం కటారుపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి రైతులకు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ కేంద్రం ద్వారా రైతులకు అవసరమగు విత్తనాల పంపిణీ చేస్తున్నారన్నారు.