ఆదివారం నుండి రెండో విడత ధాన్యం కొనుగోళ్లును రైతు భరోసా కేంద్రాల నుండి ప్రారంభించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర అశోక్ శనివారం తెలిపారు. తన వద్ద ధాన్యం కలిగిన ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయాలు జరుపుకోవాలని ఆయన తెలిపారు. తొలివిడతగా 2. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం కాగా అది పూర్తయిందని తెలిపారు. రైతుల వద్ద తాము పండించిన ధాన్యం ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో మలివిడతగా కొనుగోలు ప్రక్రియను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.