ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వట్టి వసంత కుమార్ ఆకస్మిక మృతి పట్ల పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్థసారథి సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నాడు అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ తాను దివంగత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గాల్లో ఇరువురుము మంత్రులుగా కొనసాగడం జరిగిందని ఆ సమయంలో వట్టి వసంత కుమార్ తనకు ఎంతో విలువైనటువంటి సూచనలు ఇచ్చినారని పార్థసారథి తెలిపారు.