శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించి 22 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే, ఇప్పుడు వీటిని మార్చికి జరిపినట్టు తెలుస్తోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్టణంలో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మార్చి రెండో వారంలో సమావేశాలను మొదలుపెట్టి మూడోవారం చివర్లో ముగించాలని భావిస్తున్నట్టు సమాచారం.