శ్రీ అమ్మవారి ఆలయమునకు రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతుల వారు ఆదివారం ఆలయమునకు విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరు చండీహోమం నందు పాల్గొన్నారు. తదనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము అందజేసినారు.