శ్రీకాకుళం జిల్లాలో ఆర్డీఎస్ పథకం ద్వారా 585. 42 కోట్లతో జిల్లాలో 529 కిలోమీటర్లు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పైడి భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు పనులు చేయనున్నారు. భవిష్యత్తులో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో సరఫరా ఆగిపోకుండా వ్యవస్థను ఏర్పాటు చేయమన్నారు. అంతేకాకుండా నెలకు 200 యూనిట్లు దాటితే స్మార్ట్ మీటర్లు అమరుస్తారని అధికారులు ఆదివారం తెలియజేశారు.