రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఎంపీ మార్గాని భరత్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలపై వారు చర్చించారు. ముఖ్యంగా పార్టీ బలోపేతం గురించి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించినట్టు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలియజేశారు. మంత్రితోపాటు స్థానికంగా ఉన్న అధికారులు ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు.