యువగళo కార్యక్రమం కుప్పంలో తనపై పోలీసులు కేసు ఎందుకు పెట్టారో తెలియదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రలో పోలీసులు ఉత్సవ విగ్రహాల్లో ఉండిపోయారని అన్నారు. గ్రామాల్లో రొటీన్ అనే మాటను తాను అన్నానని. తన మాటలను వక్రీకరించారని అన్నారు. తన వ్యాఖ్యలు పోలీసులకు బాధకలిగించి ఉంటే మాటలను వెనక్కి తీసుకుంటానని చెప్పానని అన్నారు.