రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌లిద్దరూ బఫూన్లు అని జలవనరులశాఖ మం త్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేశ పాదయాత్ర యువగళమో, యువ గరళమో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చినవేళ అన్నట్లు లోకేశ రాకతో టీడీపీ పతనం ప్రారంభమైందని విమర్శించారు. చంద్రబాబు కొడుకుగా తప్పితే లోకేశకు ఏ అర్హత లేదని, కేవలం దొడ్దిదారిలో మంత్రి అయ్యాడని అంబటి వ్యాఖ్యానించారు. ముందుగా మీ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చు కోవాలన్నాడు. సీఎం అభ్యర్థి పవన్ కల్యాణా, నీవా, లేక నీ తండ్రా అంటూ లోకేశ ను ప్రశ్నించాడు. తండ్రిని అవమానించేలా పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలకు చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలన్నారు. కుప్పంలో ప్రారంభమైన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం జగన్ మూడున్నరేళ్ళుగా చిత్తశుద్ధితో, పారదర్శకత తో అద్భుత పరిపాలన చేస్తున్నాడన్నారు. 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారని, అనేక ఆటుపోట్లను సీఎం జగన్ ఎదుర్కొన్నాడని, తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురిని మంత్రులు గా కూడా చంద్రబాబు చేశాడని అంబటి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలన్నీ కట్టకట్టు కొని వచ్చినా అంతిమంగా వైసీపీదే విజయమని మంత్రి అంబటి ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు కూడా గతి తప్పారని, సీనియర్ నాయకుడైనా తనలో విశ్వాసం పోయింది...అందుకే మాటల్లో తప్పులు దొర్లుతున్నాయన్నారు.