నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆత్మకూరుకు చెందిన వన్నెం నాగరాజు ఎన్నికయ్యారు. రెండు నెలలుగా ఐవైసీ వెబ్సైట్లో ఆన్లైన్ ఓటింగ్ ద్వారా జిల్లా నుంచి ముగ్గురు పోటీ చేశారు. శుక్రవారం ఓట్ల లెక్కింపు అనంతరం శనివారం విజేతను ప్రకటించారు. ఈ క్రమంలో నాగరాజు 264 ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికలే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుందన్నారు.