హిండెన్ బర్గ్, అదానీ గ్రూపుల మధ్య ప్రశ్నల యుద్ధం నడుస్తుంది. హిండెన్ బర్గ్ నివేదిక అబద్ధమని, అది భారతదేశ సార్వభౌమాధికారంపై దాడి అని అదానీ మండిపడ్డారు. దీనిపై స్పందించిన హిండెన్ బర్గ్ 'మీరు చేసిన తప్పులకు దేశం ఎలా బాధ్యత వహిస్తుంది. మీ వ్యక్తిగత కంపెనీలో డొల్లతనానికి , దేశానికి లింక్ ఏంటి?' అని ప్రశ్నించింది. తమ నివేదికకు కట్టుబడి ఉన్నామని, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరింది.