విడపనకల్ మండలం చీకలగురికి గ్రామంలోని వైకాపా కార్యకర్త లింగప్పకు చెందిన ద్విచక్రవాహనానికి సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. ఐదు గంటలకు లేచి బయటకు వచ్చి చూడగా మాటలు వస్తుండడంతో నీళ్లు పోసి ఆర్పేశారు. బాధితుడు పాల్తూరు ఎస్ఐ కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు లింగప్ప కోరారు.