న్యూజిలాండ్‌తో రెండో టీ20కి సిద్ధం చేసిన పిచ్‌పై టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది బ్యాడ్ పిచ్ అని, టీ20 ఫార్మాట్ కు ఇది ఏమాత్రం సరిపోదని అన్నాడు. ఈ పిచ్ తనను షాక్ కు గురి చేసిందని హార్దిక్ తెలిపాడు. వికెట్ తీయడంలో క్యూరేటర్లు, గ్రౌండ్ స్టాఫ్ మరింత జాగ్రత్తగా ఉండాలని కోరాడు. అతను ముందుగానే పిచ్‌లను తయారు చేయాలనుకుంటున్నాడు.
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్ తర్వాత తమ విజయంపై హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. తాము బేసిక్స్‌కు కట్టుబడి ఆడామని చెప్పాడు. ‘ఈ మ్యాచ్‌ను విజయంతో ముగిస్తామని నేను గట్టిగా నమ్మాను. కాకపోతే కాస్త ఆలస్యమైంది. ఈ తరహా మ్యాచ్‌ల్లో ప్రతీ క్షణం ముఖ్యమే. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదు. ఒత్తిడికి గురవ్వడం కంటే సింగిల్స్‌తో స్ట్రైక్‌రొటేట్ చేయడం ముఖ్యం. ఈ మ్యాచ్‌లో మేం చేసింది అదే. మా బేసిక్స్‌ను అనుసరించి ఫలితం సాధించాం. నిజాయితీగా చెప్పాలంటే ఈ పిచ్ షాక్‌కు గురి చేసింది. గత మ్యాచ్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కఠిన పిచ్‌లపై ఆడటం నాకేం ఇబ్బంది కాదు. కానీ ఈ రెండు పిచ్‌లు టీ20లకు ఏ మాత్రం సరిపోయేవి కావు. క్యూరేటర్లు పిచ్‌లు తయారు చేయడంపై శ్రద్ద వహించాలి. ముందుగానే పిచ్‌లను సిద్దం చేయాలి. ఈ మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది.