మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకలు కందుకూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతిఒక్కరు అహింస మార్గంలో పయనించి గాంధీ ఆశయాల కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, ఆర్యవైశ్యులు, పలువురు పాల్గొన్నారు.