లక్షమందికి కంటి చూపు తెప్పించాలన్న లక్ష్యంతో పరుచూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గ వ్యాప్తంగా ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో జరిగింది. దాదాపు నాలుగు వందల మంది కంటి రోగులకు పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు, మందులు ఉచితంగా ఇచ్చారు. 80 మందిని శస్త్ర చికిత్స చేయడానికి ఎంపిక చేశారు. వారికి త్వరలోనే ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయిస్తామని చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. రోగులతో పాటు వారితో వచ్చిన సహాయకులకు కూడా భోజన సౌకర్యాన్ని నిర్వాహకులు కల్పించారు.