విశాఖ శారదాపీఠం వైభవాన్ని వర్ణిస్తూ త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రం గ్రామానికి చెందిన శ్రిష్టి లక్ష్మీ సీతా రామాంజనేయ శర్మ రచించిన శ్రీ రాజశ్యామలా వైభవం గ్రంథాన్ని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమ ఖండు, తమిళనాడు, పంజాబ్ గవర్నర్లు ఆర్ఎన్ రవి, భన్వర్లాల్ పురోహిత్, శారదా పీఠాధిపతి స్వరూపానం దేంద్ర సరస్వతి ఆవిష్కరించి, ఆయనను సత్కరించారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న శారదాపీఠం వార్షికోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న ఈ కార్యక్రమం భీమవరం ప్రభుత్వ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడిగా పని చేస్తున్నారు. శ్రీశైల క్షేత్రం సంపూర్ణ చరిత్రను భక్తులకు చేరువ చేసే లక్ష్యంతో సంస్కృతంలో ఉన్న తాళపత్ర, ఇతర గ్రంథాలను క్రోడీకరించి 'శ్రీశైల ఖండం' పేరిట తెలుగులోకి అనువదించారు.