సబ్బవరంలోని అనకాపల్లి- ఆనందపురం రోడ్డు(పాత రోడ్డు) సమీపంలో ఆదివారం రాత్రి లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పెందుర్తికి చెందిన విల్లూరి రాజు, తన భార్య ఉమామహేశ్వరి(30), కుమార్తెలు వైష్ణవి, కీర్తి నిహారిక(5)తో కలిసి ఆదివారం అనకాపల్లి గౌరమ్మ సంబరానికి వెళ్లారు. సంబరం చూసుకుని తిరిగి పెందుర్తికి బైక్పై వస్తున్నారు. పాతరోడ్డు సమీపంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి బైక్ను ఢీకొనడంతో ఆ నలుగురూ తూలి రోడ్డుపై పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో ఉమామహేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్న కుమార్తె కీర్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ఎల్. సురేశ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కీర్తికి స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు. కాగా మృతురాలి భర్త ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్గా పని చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.