భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జోడో యాత్ర ఊహించిన దానికంటే విజయవంతమైంది. పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నా. ప్రజల దీనస్థితి చూసి టీషర్ట్ తోనే పాదయాత్ర చేయాలనుకున్నా. దేశం మొత్తం మనతోనే ఉంది. కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తాం. ప్రజల సహకారాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నా' అని అన్నారు.