ఏపీలో రాజకీయ పొత్తులపై సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 'తోడేళ్లంతా ఒక్కటి అవుతున్నాయి. సింహంలా మీ బిడ్డ ఒక్కడై వస్తున్నాడు. గతంలో ఒక ముసలాయన ముఖ్యమంత్రిని చూశాం. గతంలో ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. వైసీపీ పాలనలోనే ఎందుకు జరుగుతుందో ఆలోచన చేయండి. గత పాలనలో ఓ గజదొంగల ముఠా ఉండేది. దోచుకో, పంచుకో, తినుకో అనేదే వారి పాలసీ' అని అన్నారు.