సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 250 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీగా పేర్కన్నారు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. www.centralbankofindia.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.