కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీనగర్లో పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సరదాగా గడిపారు. గడ్డకట్టిన మంచులో ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకున్నారు. స్నోబాల్స్ విసురుతూ నవ్వులు చిందించారు. అందమైన ఉదయం అంటూ ఈ వీడియోను రాహుల్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ఇవి అవి కాస్తా వైరల్గా మారాయి.