భార్యతో హనీమూన్ కి వెళ్లిన ఓ యువకుడు గుర్రం పై నుంచి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని మాథెరాన్ హిల్ స్టేషన్ లో జరిగింది. ఇంతియాజ్ షేక్ (23) కు ఇటీవలే ఓ యువతితో వివాహం జరిగింది. వీరు మరో జంటతో కలిసి హనీమూన్ కి వెళ్లారు. అక్కడ గుర్రపు స్వారీ చేశారు. ఈ క్రమంలో ఇంతియాజ్ ఎక్కిన గుర్రం వేగంగా పరిగెత్తింది. దీంతో అతడు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa